Education - Employability - Efficiency - Empathy - Ethics
ఎడ్యుకేషన్: (Education: Connects with World) మనిషి మనుగడకు ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, బట్టలను సమకూర్చుకునే సామర్థ్యాన్ని అందించటమే కాకుండా, సమాజ సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేసే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. విద్య యొక్క లక్ష్యాలలో మొదటిది, లక్ష్య సాధన కోసం శ్రమించే తత్వాన్ని అలవాటు చేయటం. విద్యార్థి దశలో వివిధ విషయాలను అవగాహనతో అర్థం చేసుకుంటూ రాణించటమే కాకుండా, తోటి వారు రాణించటంలో కూడా చేయూతనివ్వాలి. సమయపాలన, క్రమశిక్షణ, వినయము, సంస్కారము, భిన్న అభిప్రాయాలు & విభిన్న సంస్కృతుల పట్ల సహనాన్ని ప్రదర్శించటం, తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవం, వారికి అవసరమైన సేవ అందించటం, మొదలైనవి సమాజం కోరుకునే ఉత్తమ విద్యార్థుల లక్షణాలు.
2. ఎంప్లాయబిలిటీ: (Employability: Productive for Self and Nation) విద్య యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఒకటిగా పరిగణించాల్సింది ఎంప్లాయబిలిటీ, అంటే విద్యార్హతకు తగ్గ వృత్తిని చేపట్టగల నైపుణ్యం & సామర్థ్యం పెంపొందించటం మరియు ఆ వృత్తిలో రాణించగలిగే ఫౌండేషన్ అందించటం. ఎడ్యుకేషన్ యొక్క Output Measurement మార్కులు & రాంకులు కావొచ్చు కానీ, Outcome Measurement మాత్రం ఎంప్లాయబిలిటీ. ఇందులో మొదటి మెట్టు - మన సబ్జక్ట్స్ పై conceptual understanding మరియు భావ వ్యక్తీకరణ, అంటే మనం నేర్చుకున్న సబ్జక్ట్స్ తోటివారికి అర్థం అయ్యే విధంగా బోధించగలగటం. ఎంప్లాయబిలిటీ పెంపెందించుకునే దిశగా, తార్కిక ఆలోచనను (Logical Thinking), విమర్శనాత్మక ఆలోచనను (Critical Thinking) శాస్త్రీయ దృక్పథాన్ని, నేర్చుకున్న అంశాలను విభిన్న సందర్భాలలో వర్తింపజేసే సామర్థ్యాన్ని మరియు సృజనాత్మక పరిష్కారాలను ప్రతిపాదించగల విశ్వాసాన్ని అలవర్చుకోవాలి. పాఠశాల / కళాశాల స్థాయిలోనే, విద్యార్థులు ఎంప్లాయబిలిటీపై అవగాహన పెంచుకోవటం, ఆ దిశలో కృషి చేయటం తప్పనిసరి.
3. ఎఫిషియన్సీ: (Efficiency: More with Less) ఏ వృత్తిలో అయినా, వీలైనంత తక్కువ వనరులతో, వీలైనంత ఎక్కువ output సాధించాలనే లక్ష్యాలు ఉంటాయి. అందుకోసం తను చేసే ప్రతీ పనికి Cost, Time, Quality పారామీటర్స్ కు కొలమానాలు (Metrics) నిర్దేశించుకొని, సరియైన ప్లానింగ్/డిజైనింగ్, మానిటరింగ్, రిపోర్టింగ్ తో ఎఫిషియంట్ గా పూర్తి చేయాలి అనే ఆలోచన & ఓరియెంటేషన్ ను బాల్య దశ నుండే అలవరచాలి. అలాగే ప్రతీ పనిలో, వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఇన్నోవేటివ్ సోలుషన్స్ అందించటం మరియు Customer Satisfaction సాధించటం ఒక వాల్యూ సిస్టంగా అలవాటు చేయాలి.
4. ఎంపతీ: (Empathy: Thinking from Others Angle) మనం ఒక రంగంలో ప్రావీణ్యం సాధించి, నిష్ణాతులం అయిన తర్వాత, మనతో ఉన్న టీం ను కూడా ఆ స్థాయికి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలి. లీడర్స్ కు ఉండాల్సిన అతి గొప్ప లక్షణం లీడర్స్ ను తయారు చేయటం. ఎంపతీ అంటే “మనం ఎదుటి వారి కోణంలో అలోచించి, స్పందించటం”. ఈ విశాల భావనను విద్యార్థి దశ నుండే ఆచరిస్తే, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరటమే కాకుండా, తోటివారికి ఆదర్శవంతంగా నిలుస్తూ, జీవితం ప్రశాంతంగా సాగిపోవటానికి దోహదపడుతుంది.
5. ఎథిక్స్: (Ethics: Way of Life) జీవితానికి నైతికత వెన్నెముక & రక్షణ కవచం. సమాజంలో ప్రతి ఒక్కరు నైతికతను ప్రాధమిక సామాజిక బాధ్యతగా ఆచరించాలి. మన ఎదుగుదలలో మొదటి కొలమానం నైతికత కావాలి. నైతికతను విస్మరించిన ఎదుగుదల ఏనాటికైనా ముప్పు కలిగిస్తుందని విద్యార్థుకు అర్థం చేయించాలి. మనం తలపెట్టిన ప్రతీ చర్యను ధర్మబద్ధమైనదేనా, సమాజ హితమైనదేనా అని సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అకాడమిక్ ఎక్సలెన్స్ ఎంత ముఖ్యమో, బిహేవియర్ అండ్ ఎథిక్స్ ఎక్సలెన్స్ కూడా అంతే ముఖ్యం అని విద్యార్థుల మదిలో ముద్ర పడాలి, నైతికత మన జీవన విధానం కావాలి. . "నీతి మార్గమెపుడు నీకు రక్ష"
1. Education: (Learn & Share – Lifelong; All-round Dev) Sprit of education is to shape students as responsible citizens to contribute for the welfare and development of society. It is beyond attaining the ability to acquire necessities like food, shelter and clothes. Inculcating the nature of hard work, teamwork and enabling all-round development are derivates of education. A grown student helps colleagues to excel to her / his level. Punctuality, discipline, humility, tolerance for different views & cultures, respect for parents and elders, service to them are the characteristics that society expects from students.
2. Employability: (Higher Responsibilities; Accountability) Output measurement of education may be marks & ranks, but Outcome measurement is employability & entrepreneurship. Education should help students to acquire competencies and skills to win a job matching to the profession and also lay foundation to excel in the career. Conceptual understanding and expressiveness are the first set of requirements for employability. To develop employability, one must adopt logical thinking, critical thinking, a scientific perspective, the ability to apply what is learned in different contexts, and the confidence to propose creative solutions. At the school / college level, it is imperative that students get awareness on employability and scale-up gradually.
3. Efficiency: (More with Less; Solve & Value Add) More with less is the expectation in any profession / industry. More quality, more quantity with less time and less cost. Therefore, the orientation of Cost, Time, Quality and Quantity as metrics should be provided from early stage so that children perform tasks efficiently with proper planning / designing, monitoring, reporting and correction. Adoption of latest technologies and exploring innovative solutions is key to raise productivity. Practicing Customer Satisfaction as a value system helps in attaining efficiency.
4. Empathy: (Think from Others’ Angle; Empower) Efficiency is governed by Empathy. Thinking and responding from others angle is the driving force for teamwork and better results. Great leader is the one who builds leadership. Once attained proficiency in a given domain/field, one must strive to bring the team to that level as well. Practicing this broad concept from the student stage not only helps one to reach peaks in life, but also helps in leading a pleasant life.
5. Ethics: (Self-Esteem; Life Culture) Ethics/morality is the backbone & protective shield for life. Everyone in society should practice ethics/morality as a primary social responsibility. The first measure of our growth should be morality/ethics. The student must understand that growth that ignores morality definitely poses risks in the future. We need to self-check whether every action we take is ethical and acceptable to society. Students need to be appraised that behavioural & ethics excellence are as important as academic excellence, and that Ethics is our way of life... "Path of ethics protects you forever"